ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారయింది. మే 2వ తేదీ అమరావతికి మోదీ రానున్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను మోదీ ప్రారంభిస్తారు.ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వెనుక బహిరంగసభ వేదికను ఏర్పాటు చేయనున్నారు. ఈ వేదిక నుంచే అమరావతి పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మోదీ నిర్వహించనున్నారు. భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. భారీగా ప్రజలు ఈ సమావేశానికి హాజరవ్వనున్నారు.