ఆనందయ్యకు మిలిటరీతో రక్షణ ఇవ్వాలి.. కిడ్నాప్ చేసే అవకాశం : వర్మ

RGV Tweet About Krishnapatnam Anandaiah. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నెల్లూరు జిల్లా కృష్ణ పట్నం ఆనందయ్య గురించి కీలక వ్యాఖ్యలు

By Medi Samrat  Published on  22 May 2021 12:40 PM GMT
ఆనందయ్యకు మిలిటరీతో రక్షణ ఇవ్వాలి.. కిడ్నాప్ చేసే అవకాశం : వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నెల్లూరు జిల్లా కృష్ణ పట్నం ఆనందయ్య గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్యకు మిలిటరీతో రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఆనందయ్యను జాతీయ సంపదగా గుర్తించి మిలటరీతో భద్రత ఏర్పాటు చేయాలని ఆర్జీవీ డిమాండ్ చేశారు. ఆర్జీవీ అక్కడితో ఆగలేదు.., అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆంటోనీ ఫౌచీ ఎయిర్ ఫోర్స్ వన్ లో కృష్ణపట్నం బయలుదేరి ఉంటారని.. వాళ్లు ఆనందయ్యను కిడ్నాప్ చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థలు తమ ఫార్ములాను బయటకు చెప్పలేదని.. కానీ ఆనందయ్య మాత్రం మందు తయారు చేసే వివరాలను బయటపెట్టడమే కాకుండా.., ఫ్రీగా మందు అందిస్తున్నారు కాబట్టి.. ఆయనకు నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు.

ఐసీఎంఆర్ గనుక ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. WHO ప్రతినిథులు కృష్ణపట్నంలో వాలిపోతారన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం భారత్ బయోటెక్, పూనావాల, స్పుత్నిక్ వాకా సంస్థలకు నిధులు ట్రాన్స్ ఫర్ చేయడం మానేసి వాటిని ఆనందయ్యకు మళ్లించాలని డిమాండ్ చేశారు.

'ఒకవేళ ఆనందయ్య చెప్పిన ప్రకారం.. కరోనా రోగుల కళ్లలో వేపాకు గుజ్జు, కాగబెట్టిన తేనె వేయడం ద్వారా కోలుకుంటే.. ఆ వైద్యం ఫైజర్, భారత్ బయోటెక్, పూనావాలా లాంటి వ్యాక్సిన్ల కంటే మెరుగ్గా పని చేస్తే.. నేనొక అమాకమైన పౌరుడినని భావిస్తాను? అలాగే, ఒకవేళ ఆనందయ్య స్టేట్మెంట్‌కు ఐసీఎంఆర్ నివేదిక అనుకూలంగా వస్తే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైంటిస్టులు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు పారాచూట్లు వేసుకుని వస్తారు' అని ట్వీట్ చేశారు.

హే, ఆనందయ్య జీ.. నాకు నోరు, ముక్కు, చివరికి చెవులు కూడా బాగానే ఉన్నాయి. కానీ, కళ్లకు, ఊపిరితిత్తులకు ఉన్న సంబంధం ఏంటో అర్థమై చావట్లేదని అన్నారు. ప్రభుత్వానికి నా మనవి ఏమంటే.. ఆక్సిజన్ కొరతతో, బెడ్లు అందుబాటులో లేక జరిగిన పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఆనందయ్యకు సహకరించండి. ఆనందయ్య అయితే తేనె, వేపాకు గుజ్జు, బీట్ రూట్, వేరుశనగపప్పు, గడ్డి, ఉల్లిగడ్డలు.. ఇలా ఏవైనా సరే అన్నింటిని కలిపేసి ప్రజల జీవితాలను కాపాడేస్తారని సెటైర్లు కూడా వేశారు.


Next Story
Share it