నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో దెబ్బతిన్న పంటలను జనసేనాని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతున్నలు ప‌వ‌న్‌కు నష్టపోయిన పంటలను చూపించారు. తమ కష్టాలను పవన్‌తో చెప్పుకుని విలపించారు. పవన్‌తో రైతులు తమ బాధను పంచుకున్నారు. ఎకరాకు ౩౦వేల వరకు ఖర్చు పెట్టామని... నివర్ తుపానుతో సర్వం నష్ట పోయామని వాపోయారు. తమకు ప్రభుత్వం సాయం అందించడం లేదని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నివర్ తుపానుతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారన్నారు. అన్నం పెట్టే రైతు కన్నీరు కారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్నకు భరోసా ఇచ్చేందుకే వచ్చానని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని.. రైతులకు ఆర్థిక సాయం వచ్చేలా కృషి చేస్తానని పవన్ తెలిపారు.


సామ్రాట్

Next Story