వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని పొలిటికల్ పార్టీగా గుర్తించడం లేదని, ఆకు రౌడీల పార్టీగా గుర్తిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచిగా చెప్తాం, మంచిగా మాట్లాడతామని, వినకపోతే చొక్కా మడతపెట్టి ముందుకు వెళ్లడం పెద్ద పని కాదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు..
వైసీపీ నాయకులు బెదిరింపు మాటలు మానేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆలోచన ఎవరైనా అధికారులకు, పోలీసులకు భయం ఉంటే వదిలేయండి వాళ్లు రారు అని జోస్యం చెప్పారు. తన కంఠంలో ప్రాణం ఉండగా ఆంధ్రప్రదేశ్ ఇబ్బంది లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు.