వైసీపీ ప్రతిపక్ష హోదా డిమాండ్‌పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. జగన్ జర్మనీ వెళ్ళాలని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ ఇచ్చేది కాదు.. ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్నారు.
వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 సీట్లు వస్తే జనసేనకు 21 సీట్లు వచ్చాయి.. అసెంబ్లీలో రెండవ అతిపెద్ద పార్టీ జనసేన అని పేర్కొన్నారు. జనసేన ఉడగా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఓట్లు ఎక్కువశాతం వస్తే వాళ్ళకు ఎక్కువ అవకాశం ఇచ్చే అవకాశం జర్మనీలో ఉంటుందన్నారు. కావాలంటే వైఎస్ఆర్సీపీ జర్మనీకి వెళ్ళవచ్చని ఉచిత సలహా ఇచ్చారు. గవర్నర్ నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నా.. ఈ రోజు అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు.. వైఎస్ఆర్సీపీ నాయకులు హుందాగా ప్రవర్తించాల్సిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.