ఆయన దేశద్రోహి.. ఏపీలో అడుగుపెట్టే అర్హత లేదు.. అమిత్‌షాపై షర్మిల ట్వీట్

By Knakam Karthik
Published on : 18 Jan 2025 10:45 AM IST

Telugu news, Andrapradesh, Congress, Tdp, Bjp, Janasena, Amith Shah, Sharmila

ఆయన దేశద్రోహి ఏపీలో అడుగుపెట్టే అర్హత లేదు.. అమిత్‌షాపై షర్మిల ట్వీట్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ట్వీట్ చేశారు. పార్లమెంట్‌లో భారతరత్న బీఆర్.అంబేద్కర్‌ను అవమానించిన అమిత్ షాకు ఆంధ్రలో అడుగుపెట్టే అర్హతలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమిత్ షా టూర్‌ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. అమిత్ షా ఏపీ పర్యటన సందర్భంగా రాష్ట్రంలోని అంబేద్కర్ విగ్రహాల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు తెలపాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, కేడర్‌కు పిలుపునిస్తున్నట్లు షర్మిల ఎక్స్ వేదికగా షర్మిల రాసుకొచ్చారు.

అంబేద్కర్‌పై చేసిన అనుచతి వ్యాఖ్యల పట్ల అమిత్ షా దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలెఉ చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాతను అవమానించడమంటే దేశ ద్రోహంతో సమానమని.. నిండు సభలో అంబేద్కర్‌ను హేళన చేస్తూ మాట్లాడిన అమిత్ షా దేశ ద్రోహి అని షర్మిల ఆరోపించారు. దేశ ద్రోహుల వ్యాఖ్యలను ఖండించకుండా, అమిత్ షాను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయకుండా ఆయనకు అతిథి మర్యాదలు చేసే వాళ్లుఎ కూడా ఈ దేశానికి ద్రోహం చేసినట్టేనన్నారు షర్మిల.

అమిత్ షాతో వేదిక పంచుకొనే పార్టీలు, మౌనంగా ఉండే పార్టీలు దేశానికి ద్రోహం చేస్తున్న పార్టీలేనని ఆమె విమర్శించారు. రాష్ట్రంలోని దళిత, బహుజన, ఆదివాసీ, మైనారిటీ ప్రజల మీద గౌరవం ఉంటే కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలు, ప్రతిపక్ష వైసీపీ కేంద్రహోంమంత్రి అమిత్ షాతో బహిరంగ క్షమాపణలు చెప్పించాలని.. కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందని షర్మిల రాసుకొచ్చారు.

Next Story