ఉర్రూతలూగించే చింతామణి నాటకం.. ఏపీలో నిషేధం.. కారణం ఏంటి.!

Government bans Chintamani drama in AP . ఆంధ్రప్రదేశ్‌లో చింతామణి నాటకంపై సర్కార్‌ నిషేధం విధించింది. ఆర్యవైశ్యుల సంఘం నాయకుల

By అంజి  Published on  18 Jan 2022 4:45 AM GMT
ఉర్రూతలూగించే చింతామణి నాటకం.. ఏపీలో నిషేధం.. కారణం ఏంటి.!

ఆంధ్రప్రదేశ్‌లో చింతామణి నాటకంపై సర్కార్‌ నిషేధం విధించింది. ఆర్యవైశ్యుల సంఘం నాయకుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తమను కించపరిచేలా ఈ నాటకం ఉందంటూ ఆర్యవైశ్య సంఘం నేతలు ప్రభుత్వానికి తెలిపారు. చింతామణి నాటకం తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధి పొందింది. ఈ నాటకం గురించి తెలియనివారుండరు.. ముఖ్యంగా గ్రామాల్లో. అయితే రాష్ట్రంలో ఎక్కడా కూడా చింతామణి నాకటాన్ని ప్రదర్శించవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కవి కాళ్లకూరి నారాయణరావు చింతామణి నాటకాన్ని రచించారు. 20 దశాబ్దంలోని మూడవ దశకంలో సామాజిక సమస్యల ఆధారంగా ఈ నాటకాన్ని రచించారు. వేశ్యావృత్తి దురాచారాన్ని ఖండించే ఈ నాటకం ఇప్పటికీ పలు గ్రామాల్లో ప్రదర్శితమవుతూనే ఉంది.

1923 నాటికే దేశ వ్యాప్తంగా 446 సార్లు ప్రదర్శించబడిన ఈ నాటకం.. మొదట బందరు రామమోహన నాటక సంఘం వారు ప్రదర్శించారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రదర్శించబడుతున్న చింతామణి నాకటం.. సమాజాన్ని పక్కదారి పట్టిస్తోంది. సమాజం బాగు పడే దిశగా కాకుండా, వ్యసనాలకు బానిసలు అయ్యేలా ఈ నాటకం ఉందని ఆర్యవైశ్య సంఘం నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కాగా ఈ నాటకాన్ని నిషేధించిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ నాటకాన్ని ప్రదర్శించవద్దని, ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.

Next Story