రేపు సీఎం జగన్ విశాఖ పర్యటన

సీఎం వైఎస్‌ జగన్ రేపు విశాఖపట్నం పర్యటనకు వెళ్ల‌నున్నారు.

By Medi Samrat  Published on  4 March 2024 2:30 PM GMT
రేపు సీఎం జగన్ విశాఖ పర్యటన

సీఎం వైఎస్‌ జగన్ రేపు విశాఖపట్నం పర్యటనకు వెళ్ల‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా విజన్‌ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం స్కిల్‌ డెవలప్‌మెంట్, ఉపాధి, సీడాప్‌ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో ముఖ్యమంత్రి సమావేశమ‌వుతారు.

రేపు ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ రాడిసన్‌ బ్లూ రిసార్ట్స్‌ లో జరిగే విజన్‌ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశం కానున్నారు. అనంతరం పీఎంపాలెంలోని వైజాగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుని స్కిల్‌ డెవలప్‌మెంట్, ఉపాధి, సీడాప్‌ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అనంతరం బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.

Next Story