ఈ సాయంత్రానికి నీ దొడ్లో ఎంత మంది ఉంటారో లెక్క పెట్టుకో.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్
ఆనాడు పాలమూరు ఊరు లేకపోయినా, పార్లమెంట్ లో నోరు లేకపోయినా కేసీఆర్ ను గెలిపించారు. పాలమూరు ఎంపీగా కేసీఆర్ ను గెలిపించి పంపిస్తే ఇచ్చింది ఏమిటీ.. తెచ్చింది ఏమిటీ..? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు
By Medi Samrat Published on 19 April 2024 10:04 AM GMTఆనాడు పాలమూరు ఊరు లేకపోయినా, పార్లమెంట్ లో నోరు లేకపోయినా కేసీఆర్ ను గెలిపించారు. పాలమూరు ఎంపీగా కేసీఆర్ ను గెలిపించి పంపిస్తే ఇచ్చింది ఏమిటీ.. తెచ్చింది ఏమిటీ..? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన పాలమూరు యూనివర్సిటీ లో అధ్యాపక ఖాళీలు కూడా కేసీఆర్ భర్తీ చేయలేదన్నారు. జూరాలతో పాటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేదు..బీఆర్ఎస్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి గురించి ఎప్పుడైనా పార్లమెంట్ లో మాట్లాడారా..? అని ప్రశ్నించారు.
మళ్లీ ఆయనకు ఎందుకు ఓటు వేయాలి.. శ్రీనివాస్ రెడ్డి కి ఓటు వేస్తే ఏం ఉపయోగం..? అని ప్రశ్నించారు. కేటీఆర్.. మీ కారు కరాబ్ కాలేదు.. ఇంజన్ అనుం చెడ్డది.. తూకానికి అమ్ముడే.. కేటీఆర్.. నీ అయ్య ఆరోగ్యం కూడా అనుం చెడ్డదన్నారు.. కారును బండకేసి కొట్టారు.. వంద మీటర్ల లోతులో బొందపెట్టారు. ఇంకా కేసీఆర్ పొంకనాలు కొడుతున్నాడు.. పిట్టల దొర 20 మంది ఎమ్మెల్యేలు టచ్ ఉన్నారని చెబుతున్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద.. తోడేళ్లలా కొట్టుకుపోతామని అనుకుంటున్నావా..? చిటికె కాదు.. మిద్దెక్కి డప్పు కొట్టు.. నీ దగ్గర ఎవరు ఉంటరో చూడు అని సవాల్ విసిరారు.
కాపాలా ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డి.. ప్రయత్నం చేసి చూడు.. మా ఎమ్మెల్యేలను కంచె వేసి కాపాడుకుంటాం.. ఇక్కడున్నది రేవంత్ రెడ్డి.. హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నడు ఇక్కడ.. వచ్చి ముట్టుకో.. కాకిలా మాడిపోతావ్ అన్నారు. ఈ సాయంత్రానికి నీ దొడ్లో ఎంత మంది ఉంటారో లెక్క పెట్టుకోన్నారు.
100 రోజుల్లో మహిళలకు ఆర్టీసీ బస్సు ల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచాం.. 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇస్తున్నాం.. ఈ ప్రభుత్వం ఆడబిడ్డల ప్రభుత్వం.. ఆడబిడ్డలను ఆదుకుంటాం.. ఇందిరమ్మ రాజ్యంలో మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.
మక్తల్ , నారాయణపేట, కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తీసుకువచ్చాం.. ఉమ్మడి జిల్లాలో అనేక విద్యాసంస్థలను తీసుకువచ్చాం.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 30 వేల కోట్ల కేంద్రం నుంచి రాబట్టడానికి ఒత్తిడి తీసుకువచ్చాం.. పాలమూరు లో కాంగ్రెస్ ను ఓడించాలని గద్వాల నుంచి దొరసాని బయలుదేరింది.. మీ గద్వాల గడీల ముందు బానిసలుగా బతకదల్చుకోలేదు.. మీ జాతకం, మీ రంగు, నీతి జాతి మాకు తెలుసు అని డీకే అరుణపై ధ్వజమెత్తారు. మిమ్మల్ని పండబెట్టి తొక్కి మా అభ్యర్థిని కాంగ్రెస్ కార్యకర్తలు పార్లమెంటుకుపంపిస్తారన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న చిన్నారెడ్డి ని ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ను చేశాం.. జిల్లా నాయకులకు గుర్తింపునిచ్చాం.. ఆగస్టు 15 లోగా ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేసే బాధ్యత నాది.. పార్లమెంట్ లో కొట్లాడి వర్గీకరణ సాధించే బాధ్యత మాది.. 30 యేళ్ల వర్గీకరణ సమస్య కు శాశ్వతంగా పరిష్కారం చూపించే బాధ్యత మాది.. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, సమస్యలు పరిష్కారం కావాలన్న ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఇక్కడే పుట్టినా ,పెరిగిన, పోయినా ఇక్కడి మట్టిలో కలిసిపోతా.. నల్లమల బిడ్డ గా పాలమూరుపైన నాకు ఉన్న దుఖం ఎవరికైనా ఉంటుందా.. నేను పాలమూరు బిడ్డ ను.. అభివృద్ధి చేసే బాధ్యత నాది.. పార్లమెంటు లో మన బిడ్డ ఉండాలి.. ఆలోచించండన్నారు.