బాబు మోసం చేశారు.. ఆయ‌న‌ ప్రశ్నించటమే మానేశారు : సీఎం జ‌గ‌న్‌

CM Jagan Fire On Chandrababu And Pawan Kalyan. చుక్కల భూములపై సంపూర్ణ హక్కులు కల్పించేలా సీఎం జగన్ రైతులకు పట్టాలు పంపిణి చేశారు.

By Medi Samrat  Published on  12 May 2023 10:24 AM GMT
బాబు మోసం చేశారు.. ఆయ‌న‌ ప్రశ్నించటమే మానేశారు : సీఎం జ‌గ‌న్‌

CM Jagan


చుక్కల భూములపై సంపూర్ణ హక్కులు కల్పించేలా సీఎం జగన్ రైతులకు పట్టాలు పంపిణి చేశారు. శుక్రవారం నాడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ చుక్కల భూములను పట్టా భూములుగా మారుస్తూ 22ఏ(1)(ఈ) నుంచి తొలగించే విధంగా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు కలుగ‌నుంది. దాదాపు రూ.20,000 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన 2,06,171 ఎకరాల భూములపై రైతులకు సర్వ హక్కులు కలుగ‌నున్నాయి.

ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. 97,471 రైతు కుటుంబాలకు మంచి చేసేలా, 2లక్షల, 6 వేల 171 ఎకరాలు రికార్డుల్లో నమోదు చేశామ‌ని తెలిపారు. రైతు బాగుంటే.. రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం మనదన్నారు. రైతులందరికి చుక్కల భూముల పై పూర్తి హక్కులు కల్పించామ‌ని తెలిపారు. రైతన్నల కష్టం నేను చూశాను.. మీకు నేను ఉన్నానని భ‌రోసా ఇచ్చారు. ప్రతి రెవెన్యూ గ్రామంలో భూసర్వే వేగంగా జరుగుతోందని.. భూ హక్కు పత్రాలు కూడా వేగంగా ఇస్తున్నామ‌ని తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా భూసర్వే చేస్తున్నామ‌ని.. ఆర్బీకేల ద్వారా రైతులకు ఎంతో మేలు చేశామ‌ని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా ప్రతి అడుగు రైతన్నల కోసమే వేశాని.. మనది రైతు పక్షపాత ప్రభుత్వమని అన్నారు.

రైతుల రుణాలను మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశార‌ని జగన్ మండిపడ్డారు. దానిపై దత్తపుత్రుడు, పచ్చ మీడియా ఒక్క మాట కుడా అనలేదని విమర్శించారు. ప్రశ్నిస్తా అని చెప్పి ప్రశ్నించటమే మానేశారని దుయ్యబట్టారు. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు ఒక వైపు, బాబు స్కీప్టులను డైలాగులుగా చెబుతున్న ప్యాకెజీ స్టార్ ఒక వైపు, వీరి డ్రామాను రక్తికట్టించేందుకు పచ్చ మీడియా ఒక వైపు డ్రామాలు వేస్తున్నారని.. రైతన్నలు వీళ్ల డ్రమాలను నమ్మవద్దని జగన్ కోరారు. చంద్రబాబుకి ఒటు వేస్తే సంక్షేమ పథకాలు నిలచిపోతాయని సీఎం జగన్ పేర్కొన్నారు. వీళ్ల విధానం డీపీటీ.. పంచుకో, తినుకో, దోచుకో.. జీవీ రావు చార్టర్ అకౌంటెంట్ సర్వీస్ రద్దయిందని ఇలాంటి దానయ్యకు కోటు తొడిగి ఆర్థిక నిపుణుడిగా చూపించారని విమర్శించారు. చంద్రబాబు మనసులో మాటలను వీళ్లతో చెప్పిస్తున్నారని అన్నారు. పేదలందరికి ఇళ్లు ఇస్తుంటే.. వీళ్లకి కడుపు మంట అని మండిపడ్డారు.


Next Story