మొంథా తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు

రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వ‌హించారు.

By -  Medi Samrat
Published on : 28 Oct 2025 10:41 PM IST

మొంథా తుఫాను ప్రభావంపై సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు

రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వ‌హించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ విరామం లేకుండా ముఖ్యమంత్రి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రెండు సార్లు ఆర్టీజీ సెంటర్ నుంచి సమీక్షలు నిర్వ‌హించిన ఆయ‌న మ‌రో రెండుసార్లు టెలీకాన్ఫరెన్సులు కూడా నిర్వహించారు. ఆపై మూడోసారి కూడా ఆర్టీజీ సెంటర్ నుంచి చంద్రబాబు సమీక్షనిర్వ‌హించారు. ఆర్టీజీ సెంటర్ కు వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి రియల్ టైంలో సమస్యల పరిష్కారానికి సీఎం కృషి చేస్తున్నారు.

చెట్ల తొలగింపు, సబ్ స్టేషన్లల్లో సమస్యలను తక్షణం పరిష్కరించేలా సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయిలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ఆర్టీజీఎస్ కేంద్రంలో మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, నారాయణ తుపాను ప్రభావంపై అధికారులకు సూచనలిస్తున్నారు.

ఆర్టీజీ సెంటర్ నుంచి సీఎం వర్షప్రభావిత జిల్లాల్లో మంత్రులు, అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎంత చిన్న పల్లెటూరైనా, లంక గ్రామామైనా తుఫాను సహయక చర్యలు అందేలా సీఎం ఆదేశాలిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి పునరావాస శిబిరాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. జిల్లాలకు వెళ్లిన మంత్రులు, ప్రత్యేకాధికారులతో ఆర్టీజీ సెంటర్ నుంచి నిరంతరం చర్చిస్తున్నారు. రాష్ట్రంలోని తుఫాను పరిస్థితిపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేశారు. ముఖ్యమంత్రిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Next Story