ఆ నీటిని వాడుకుంటే తప్పేంటి.? : సీఎం చంద్రబాబు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీటి వివాదంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.

By -  Medi Samrat
Published on : 7 Jan 2026 7:40 PM IST

ఆ నీటిని వాడుకుంటే తప్పేంటి.? : సీఎం చంద్రబాబు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీటి వివాదంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇలాంటి అంశాలను రాజకీయ కోణంలో చూడకూడదని ఆయన స్పష్టం చేశారు. నీటి విషయంలో నేతలు పోటీపడి ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయడం, సవాళ్లు విసురుకోవడం ఇరు రాష్ట్రాల ఆరోగ్యకరమైన సంబంధాలకు మంచిది కాదని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. నదుల నుంచి వృధా సముద్రంలో కలుస్తున్న నీటిని ప్రజల అవసరాలకు వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు.

ప్రజావసరాల కోసం చేపట్టే ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలు చేయడం, అనవసర వివాదాలు సృష్టించడం సరికాదన్నారు. నీరు అనేది రైతుల జీవితాలకు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశమని అన్నారు. పొరుగు రాష్ట్ర అవసరాలను తాము గౌరవించామని, గోదావరి జలాలను మంజీరాకు తరలిస్తున్నప్పుడు తాము ఏనాడూ అడ్డుకోలేదని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రస్తుతం గోదావరిలో నీటి లభ్యత పుష్కలంగా ఉందని, ఉన్న నీటిని సమర్థవంతంగా వాడుకోవడం పై దృష్టి పెట్టాలని సూచించారు.

Next Story