ఎరువుల లభ్యత, సరఫరాపై సీఎం రివ్యూ..అధికారులకు కీలక ఆదేశాలు

ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు

By Knakam Karthik
Published on : 24 Aug 2025 3:36 PM IST

Andrapradesh, Amaravati, CM Chandrababu, Farmers, Urea Shortage, Fertilizers.

ఎరువుల లభ్యత, సరఫరాపై సీఎం రివ్యూ..అధికారులకు కీలక ఆదేశాలు

అమరావతి: ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎరువుల లభ్యత, సరఫరాపై సీఎస్, డీజీపీ, వ్యవసాయశాఖ, విజిలెన్స్ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత, సరఫరా వివరాలపై సీఎం ఆరా తీశారు. విజిలెన్స్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

యూరియా, ఎరువుల స్టాక్ చెకింగ్ చేపట్టాలని విజిలెన్స్ అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. వ్యవసాయేతర అవసరాలకు యూరియా తరలిపోకుండా కట్టడి చేయాలని సీఎం సూచించారు. ఎరువుల ధరలు పెంచి అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సీఎం ఆదేశించారు. మార్క్ ఫెడ్ ద్వారా ఎంత మేర ఎరువుల సరఫరా జరుగుతోందో అధికారులకు సీఎంకు వివరించారు. ప్రైవేట్ డీలర్లకు ఎరువుల కేటాయింపు తగ్గించి మార్క్ ఫెడ్ ద్వారానే ఎక్కువగా సరఫరా జరిగేలా చూడాలని సూచించారు. యూరియా సరఫరా విషయంలో రైతులు ఇబ్బందది పడకుండా చూసుకోవాలి. ఎరువులు పక్కదారి పట్టకుండా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Next Story