ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం చంద్రబాబు

కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) జాతీయ ప్రధాన కార్యదర్శి దివంగత సీతారాం ఏచూరి భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుండి హైదరాబాద్ కు చేరుకున్నారు

By Medi Samrat  Published on  14 Sept 2024 7:00 AM IST
ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం చంద్రబాబు

కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) జాతీయ ప్రధాన కార్యదర్శి దివంగత సీతారాం ఏచూరి భౌతికకాయానికి నివాళులు అర్పించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుండి హైదరాబాద్ కు చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు గత సాయంత్రం రాజధానికి చేరుకుని ఏచూరి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ఏచూరి పేదల కోసం ఎన్నో పనులు చేశారని, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం గుర్తుండిపోతుందని చంద్రబాబు నాయుడు అన్నారు. పేద ప్రజల కోసం పోరాడిన వ్యక్తి సీతారాం ఏచూరి, ఆయన పోరాటాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని నాయుడు వ్యాఖ్యానించారు. గత నాలుగు దశాబ్దాలుగా ఆయనతో తనకు ఉన్న సన్నిహిత సంబంధాన్ని తెలిపారు. ఏచూరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, 40 ఏళ్లుగా ఆయన్ను దగ్గరగా చూశానని, ఆయన మంచి నాయకుడని ఏపీ సీఎం కొనియాడారు. ఆయనకు నివాళులర్పించిన తరువాత, చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు చేరుకున్నారు.

Next Story