మొంథా తుపాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష

మొంథా తుపాను ప్రభావంపై సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు

By -  Knakam Karthik
Published on : 27 Oct 2025 12:30 PM IST

Andrapradesh, Amaravati, CM Chandrababu, Cyclone Montha, Rain Alert, Heavy Rains

మొంథా తుపాను ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: మొంథా తుపాను ప్రభావంపై సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కాగా ప్రస్తుం కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో మొంథా తుపాన్ కేంద్రీకృతమైంది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. 16 కి.మీ వేగంతో తుపాన్ తీరాన్ని సమీపిస్తుడటంతో ఈ రోజు, రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచన ఉందని తెలిపింది. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా రేపు రాత్రికి తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఈ మేరకు అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ప్రతీ గంటకు తుఫాన్ కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మొంథా తుఫాన్‌ ప్రభావంపై ముఖ్యమంత్రితో ఫోన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్‌కు సీఎం సూచించారు. వర్షాలు, వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కాలువ గట్లు పటిష్టం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని అధికారులకు చెప్పారు. కాగా ఈ సమీక్షలో మంత్రులు లోకేష్, అనిత, సీఎస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story