ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలో సమావేశమయ్యారు.

By Medi Samrat
Published on : 25 April 2025 9:15 PM IST

ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ భేటీ దాదాపు గంటన్నర పాటు సాగింది. ఉగ్రవాదంపై పోరులో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఏపీ రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభం సందర్భంగా మే 2వ తేదీన తలపెట్టిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ప్రధానితో చంద్రబాబు భేటీలో అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు పురోగతి, రాష్ట్రానికి సంబంధించిన ఇతర కీలక ప్రాజెక్టులపై కూడా చర్చించారు. అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వెలగపూడిలోని సచివాలయం వెనుక భాగంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ బహిరంగ సభకు సుమారు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.

Next Story