భారత్-అమెరికాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ప్రపంచ ఆర్ధిక స్థిరత్వానికి ఇది ఓ చారిత్రాత్మక ఘట్టం అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అమెరికాతో చారిత్రక వాణిజ్య ఒప్పందం చేసుకోవటంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. సుంకాలను 18% శాతానికి తగ్గించడం ప్రపంచంలోని రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
నిరంతరం ప్రపంచ వృద్ధిని కాంక్షించేలా ఈ దార్శనిక నిర్ణయం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ ఆర్థికశక్తి కేంద్రంగా తన పాత్రను సుస్థిరం చేసుకుంటోందని సీఎం పేర్కొన్నారు. భారత ఎగుమతుల్లో పోటీ తత్వాన్ని గణనీయంగా పెంచేలా ఒప్పందం ఉందని.. ఈ చారిత్రాత్మక ఒప్పందం ఏపీ సహా దేశ యువత, రైతులకు అపారమైన అవకాశాలను సృష్టిస్తుందని ట్వీట్ లో పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.