మరోసారి ప్రెస్ మీట్ పెట్టిన పోసాని.. ఈసారి ఎన్నో సూటి ప్రశ్నలు

Posani Krishnamurali Fires On Pawan Kalyan. పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ప్రస్తుతం రచ్చ జరుగుతూ ఉంది. రిపబ్లిక్ ప్రీ రిలీజ్

By Medi Samrat  Published on  28 Sept 2021 9:01 PM IST
మరోసారి ప్రెస్ మీట్ పెట్టిన పోసాని.. ఈసారి ఎన్నో సూటి ప్రశ్నలు

పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ప్రస్తుతం రచ్చ జరుగుతూ ఉంది. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై పవన్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని పోసాని కృష్ణమురళి అన్నారు. ఈరోజు మరోసారి పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టారు.

అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు.. ఆయనపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లైవ్ లో ఆయన కుమార్తె గురించి, ఆయన ఇంట్లోని ఇతర మహిళల గురించి దారుణంగా మాట్లాడారు. దాంతో చిరంజీవి ఎంతో మనోవేదనకు గురయ్యారు. కనీసం అన్నం కూడా తినకుండా, ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారట. ఈ విషయాన్ని నాకు కురసాల కన్నబాబు చెప్పారు. అప్పట్లో కన్నబాబు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాడు. కన్నబాబు నాకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వెంటనే, అన్నయ్యకు ఓసారి ఫోన్ ఇవ్వండి అన్నాను. అప్పుడు చిరంజీవి మాటల్లో తీవ్రమైన బాధ కనిపించింది. నా కుటుంబంలోని ఆడవాళ్లకు, రాజకీయాలకు ఏమిటి సంబంధం పోసానీ! అంటూ ఆవేదన వెలిబుచ్చారు. దాంతో నేను ప్రజారాజ్యం పార్టీ కార్యాలయానికి వెళ్లి కేశినేని నానీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడాను. ఆ దెబ్బకు అట్నుంచి స్పందనే లేదు. ఆ సమయంలో పవన్ ఏమయ్యాడు? తన అన్నయ్య చిరంజీవి కుటుంబాన్ని వాళ్లు అన్ని మాటలు అంటే పవన్ ఎక్కడున్నాడు? బయటికి వచ్చి ఎందుకు ప్రశ్నించలేదు?" అంటూ పోసాని నిలదీశారు. నాటి సంఘటనతో చిరంజీవికి తనపై ప్రేమ పెరిగిందని పోసాని వెల్లడించారు. పోసాని నా హృదయంలో ఉన్నాడంటూ ఆయన తన సన్నిహితుల వద్ద అన్నట్టు తర్వాత తెలిసిందని వివరించారు. పవన్ తో పాటు ఆయన అభిమానులు కూడా ఉన్మాదులని పోసాని అభివర్ణించారు.

జగన్‌పై విమర్శలు చేసినందుకే తాను రియాక్ట్ అయ్యానని, దీనిపై పవన్ ఫ్యాన్స్‌ టార్గెట్ చేయడమేంటని ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ పవన్ కళ్యాణ్‌ను బహిరంగంగా విమర్శించినప్పుడే లేవని నోళ్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయని ప్రశ్నించారు. రాత్రి నుంచీ తనకు ఫోన్లు వస్తూనే ఉన్నాయన్న పోసాని బూతులు తిడుతూ ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. అక్కడితో ఆగని పోసాని పవన్ ఓ సైకోలా వ్యవహరిస్తున్నారని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తన కుటుంబంపై అనుచితమైన విమర్శలు చేసి తనను డిమోరలైజ్ చేయాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కొందరు ఫోన్ చేసి తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారని పోసాని మండిపడ్డారు. తన కుటుంబంపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోవాలా ? అని ప్రశ్నించారు.

Next Story