ఘోర ప్రమాదం.. అదుపు తప్పి వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌ సహా 9 మంది మృతి

Bus accident in west godavari district.. 9 died. పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లా పరిధిలోని జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి

By అంజి  Published on  15 Dec 2021 1:16 PM IST
ఘోర ప్రమాదం.. అదుపు తప్పి వాగులో పడ్డ ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌ సహా 9 మంది మృతి

పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లా పరిధిలోని జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి.. వంతెనపై నుండి వాగులో పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌ సహా 9 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరి కొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాద స్థలం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.

అశ్వరావుపేట నుండి జంగారెడ్డి గూడెం వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సులో ౪౦ మంది ప్రయాణికులు ఉన్నారని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందా.. లేదా ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు మాత్రం.. వంతెనకు రెయిలింగ్‌ లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. కాగా తమ వారు మృతి చెందిన విషయం తెలుసుకున్న ఆయ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story