5 నెలలే సమయం : అచ్చెన్నాయుడు
టిడిపి సీనియర్ నాయకుడు, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై చేబ్రోలు పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదయ్యింది
By Medi Samrat Published on 17 Nov 2023 1:30 PM GMTటిడిపి సీనియర్ నాయకుడు, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై చేబ్రోలు పోలీస్ స్టేషన్ లో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. సంగం డెయిరీ వద్ద తనపై దాడి జరిగిందంటూ ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురంకు చెందిన రాము చేబ్రోలు పోలీసులను ఫిర్యాదు చేసాడు. డెయిరీ వద్దకు పిలిచి తనను కర్రలు, హాకీ స్టిక్స్ తో కొట్టారంటూ బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసారు. ధూళిపాళ్లపై నమోదయిన హత్యాయత్నం కేసుపై ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఖండించారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఓటర్ లిస్ట్ కన్నా వైసీపీ ప్రభుత్వం టిడిపి నాయకులు, సామాన్యులపై పెట్టిన అక్రమ కేసుల లిస్టు ఎక్కువగా ఉందన్నారు. జగన్ సర్కార్ వైఫల్యాలను,అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే ధూళిపాళ్లపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. అరాచక పాలన వెలగబెడుతున్న ఈ నాలుగున్నరేళ్లుగా టీడీపీ నేతలపై వందలాది అక్రమ కేసులు పెట్టించారని.. ఏం చేయగలిగారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఇంకా కేసులు పెట్టి ఏం పీకుతారు? అని ప్రశ్నించారు.
గతంలో సంగం డెయిరీని అక్రమించుకోవాలని ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేసిందని.. అవి ఫలించకపోవడంతోనే ఇప్పుడు కేసుల పేరిట వేధింపులకు తెరతీసారని ఆరోపించారు అచ్చెన్నాయుడు. జగన్ రెడ్డి.. మీకు ఇంకా 5 నెలలే ఉంది.. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అంటూ అచ్చెన్న సవాల్ విసిరారు. వైసీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.