జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో చేసిన వ్యాఖ్యలు వైసీపీకి హెల్ప్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో అధికారుల తీరును తప్పుబట్టారు పవన్ కళ్యాణ్. ఏకంగా హోమ్ మినిష్టర్ పదవిని తీసుకుంటానంటూ సంచలన ప్రకటన చేశారు. ఇక ఇటీవల ఓ ప్రభుత్వ స్కూల్ ను సందర్శించిన ఆయన ప్రైవేట్ స్కూల్ కంటే బాగున్నాయంటూ మెచ్చుకున్నారు.
ఈ వీడియోలను వైసీపీ సోషల్ మీడియా బలంగా ఉపయోగిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూస్తుంటే తాము ప్రతిపక్షంలో ఉండి చెబుతోంది నిజమేనని వైసీపీ నాయకులు అంటున్నారు. రాష్ట్రంలో అరాచకాలు పెరగడంతోనే పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని వైసీపీ తన వాయిస్ ను వినిపిస్తూ ఉంది. ఇక గత ప్రభుత్వ హయాంలో నాడు-నేడు కింద స్కూల్స్ అభివృద్ధి బాగా జరిగిందని, అది చూసే పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారంటూ వైసీపీ విభాగం ఈ వీడియోలను వైరల్ చేస్తూ వస్తోంది. 2017లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా పాఠశాలలను సందర్శించిన ఫోటోలను, ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలలో చేసిన పర్యటనల సమయంలో ఉన్న స్కూల్స్ ఫోటోలను కూడా తెగ వైరల్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ రెండు సంఘటనలు వైసీపీకి బాగా హెల్ప్ అయ్యాయి.