సినిమా టికెట్ రేట్ల తగ్గింపుపై.. ఏపీ హైకోర్టు తీర్పు

AP High court suspends movie ticket price go. సినిమా టికెట్‌ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్‌ తగిలింది. ఇటీవల టికెట్ల రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిన విషయం తెలిసిందే.

By అంజి  Published on  14 Dec 2021 11:20 AM GMT
సినిమా టికెట్ రేట్ల తగ్గింపుపై.. ఏపీ హైకోర్టు తీర్పు

సినిమా టికెట్‌ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్‌ తగిలింది. ఇటీవల టికెట్ల రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆ జీవో నెంబర్‌ 35ను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్‌ చేసింది. పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు అనుమతిస్తూ.. పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందని కోర్టు పేర్కొంది. సినిమా టికెట్‌ ధరల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని చెప్పింది.

కొత్త సినిమాలు రిలీజ్‌ అయ్యే టైమ్‌లో.. థియేటర్‌ యజమానులకు టికెట్‌ రేట్లు పెంచుకునే హక్కు ఉంటుందని పిటిషనర్లు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై మంగళవారం నాడు హైకోర్టులో వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు ఆదినారాయణ రావు, దుర్గా ప్రసాద్‌ వాదించారు. టికెట్‌ రేట్లు తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. వారి వాదనను హైకోర్టు ఏకీభవించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 35ను సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Next Story