కొత్త పీఆర్‌సీ జీవోలపై.. ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

AP High court interim orders to stay on new PRC GOs. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి మరో షాక్‌ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీచేసిన కొత్త పీఆర్‌సీ జీవో లను నిలిపివేస్తూ హైకోర్ట్

By అంజి  Published on  24 Jan 2022 1:58 PM IST
కొత్త పీఆర్‌సీ జీవోలపై.. ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి మరో షాక్‌ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీచేసిన కొత్త పీఆర్‌సీ జీవో లను నిలిపివేస్తూ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఉద్యోగుల తరఫున న్యాయవాది రవితేజ వాదనలు వినిపిస్తున్నారు. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయలేదని పిటిషనర్ న్యాయవాది పేర్కొన్నారు. నోటీసు లేకుండా జీతాల్లో కోత విధించటం చట్టవిరుద్ధమని పిటిషనర్ కోర్టుకు చెప్పారు. జీతాలు తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉందని హైకోర్టు చెప్పింది. అయితే హెచ్‌ఆర్‌ఏ విభజన చట్టప్రకారం జరగలేదని పిటిషనర్ న్యాయవాది అన్నారు.

దీంతో కొత్త పీఆర్‌సీతో జీతాలు ఎంత తగ్గాయో, అలాగే జీతం పెరిగిందో లేదో అంకెలలో చెప్పాలంటూ హైకోర్టు ప్రశ్నించింది. పీఆర్‌సీపై సవాలు చేసే హక్కు ఉద్యోగులకు లేదని, పూర్తి సమాచారం లేకుండా పిటిషన్ ఎలా వేస్తారు అంటూ ప్రశ్నించింది. పీఆర్‌సీ నివేదిక బయటకు రాకుంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని హైకోర్టు పేర్కొంది. వాదనలు విన్న కోర్టు ఉద్యోగుల సంఘం నేతలు కోర్టు కి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ కృష్ణయ్య తో పాటు జడ్జి ముందుకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. సమ్మె నోటీసు ఇచ్చిన 12 మంది కమిటీ సభ్యులు కూడా విచారణకు రావాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణ ఇవాళ మధ్యాహ్నం 2.15 గంటల వరకు వాయిదా వేసింది.

Next Story