ఈ నెల 20న ఏపీ కేబినెట్ భేటీ..కీలక పథకాల అమలుపై చర్చ
ఈ నెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భేటీ కానుంది.
By Knakam Karthik
ఈ నెల 20న ఏపీ కేబినెట్ భేటీ..కీలక పథకాల అమలుపై చర్చ
ఈ నెల 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భేటీ కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి కీలక పథకాలపై అమలు చర్చ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వచ్చే నెల 12వ తేదీ నాటికి ఏడాది పాలనను కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకుంటుంది. కాగా ఈ ఏడాది పాలనలో కూటమి సర్కార్ చేసిన సంక్షేమ పథకాలు.. అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లే అంశంపై చర్చించనున్నారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలన, కూటమి సర్కార్ ఏడాది పాలనకు మధ్య తేడా ఏంటో ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టే అంశంపై రాష్ట్ర మంత్రి వర్గంలో చర్చించనున్నారు. అమరావతి రీస్టార్ట్ పనులు, రాష్ట్రంలో పెద్ద ఎత్తున వచ్చిన పెట్టుబడులు, ఉపాధి అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. పలు సంస్థలకు జరిపిన భూ కేటాయింపులపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది.