అమరావతి: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసన సభ...10 గంటలకు మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి...సభ ఎన్ని రోజులు జరగాలి..అనే అంశం పై బీఏసీ లో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. సుమారు వారం రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది..అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో పలు అర్డినెన్స్‌లను అసెంబ్లీలో బిల్లుల రూపంలో ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. ఎప్పటి లాగే ఈ సారి కూడా అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకాకపోవచ్చు.
ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని కీలక ఆర్డినెన్స్ లు ప్రవేశ పెట్టనున్నారు. పంచాయితీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణలకు సంబంధించిన ఆర్డినెన్స్‌లు సభలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు నాలా చట్ట సవరణ, షెడ్యూల్ సబ్ క్యాస్ట్, ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆర్డినెన్స్‌లను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వీటిని బిల్ రూపంలో తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం చట్టం చేయనుంది. గురువారం జరిగే మంత్రివర్గం సమావేశంలో మరికొన్ని బిల్లులు ఆమోదించి.. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది.