చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేసిన అంబటి

Ambati Rambabu made sensational allegations against Chandrababu and Pawan Kalyan. మంత్రి అంబటి రాంబాబు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్

By Medi Samrat  Published on  30 May 2023 3:45 PM GMT
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేసిన అంబటి

మంత్రి అంబటి రాంబాబు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై సంచలన ఆరోపణలు చేశారు. సత్తెనపల్లిలో తనను ఓడించేందుకు కొత్త వస్తాదులను రంగంలోకి దింపుతున్నారన్నారు. కొడాలి నాని, రోజాలను కూడా ఓడించేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సత్తెనపల్లికి వచ్చి మీటింగులు పెట్టారని.. తనను ఓడించేందుకు సర్వ శక్తులు ఒడ్డిస్తున్నారనే విషయం స్పష్టంగా అర్దమవుతుందన్నారు. చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మారుస్తూ ఎన్ని పాచికలు వేసినా ఆయనను బీసీలు నమ్మరని అంబటి రాంబాబు అన్నారు. పూలే, అంబేడ్కర్‌ ఆశయాల సాధన దిశగా జగన్‌ పాలన సాగుతోందని తెలిపారు.

టీడీపీకి ఇదే చివరి మహానాడని.. ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగే అని అన్నారు అంబటి. టీడీపీ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదు. తుక్కు తుక్కయిన సైకిల్‌ను బాబు తొక్కలేరు. ఇచ్చిన వాగ్ధానాలు చంద్రబాబు ఎప్పుడైనా నెరవేర్చారా? ఒక్క హామీనైనా నిజాయితీగా అమలు చేశారా? అని ప్రశ్నించారు. బాబు జీవితమంతా ప్రజలను మోసం చేయడమే అని మంత్రి అంబటి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరగబవుతోందని అన్నారు. ఎన్టీఆర్‌ బతికుంటే బాబు బతుకు బజారుపాలయ్యేదని అన్నారు.


Next Story