పవన్ కూలీ నెంబర్ 1: అంబటి

మంత్రి అంబటి రాంబాబు రాజకీయాలకే పనికిరాని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని విమర్శలు చేశారు. పవన్ నాయకుడు కాదు కూలీ నెంబర్ 1 అంటూ అంబటి

By అంజి  Published on  19 May 2023 4:00 PM GMT
Minister Ambati Rambabu, Pawan Kalyan, APnews

పవన్ కూలీ నెంబర్ 1: అంబటి 

మంత్రి అంబటి రాంబాబు రాజకీయాలకే పనికిరాని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని విమర్శలు చేశారు. పవన్ నాయకుడు కాదు కూలీ నెంబర్ 1 అంటూ అంబటి విమర్శించాడు. పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ రోజురోజుకు మరగుజ్జులా మారిపోతుందని అంబటి అన్నారు. పవన్ పెరగడు, ఇతరులను పెరగనివ్వదని అన్నారు. రాజకీయ పార్టీ పెట్టి ఏళ్లు గడుస్తున్నా ఇంకా పవన్ నోట్లో వేలు పెట్టుకుని చంద్రబాబు చేయి పట్టుకునే తిరుగుతున్నాడని అన్నారు. 2014 లో చంద్రబాబుకు మద్దతిచ్చిన పవన్ ఇప్పటివరకు రాజకీయంగా పెరిగిందేమీ లేదన్నారు.

చంద్రబాబు దళిత ద్రోహి అని, పవన్ కళ్యాణ్ కూలీ నెంబర్ వన్ అని అభివర్ణించారు. నువ్వు పెరగవు, ఇంకొకడ్ని పెరగనివ్వవు అంటూ పవన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు పచ్చజెండా ఊపితేనే వారాహి వాహనం కదులుతుంది, చంద్రబాబు రెడీ అంటేనే నువ్వు ప్రచారానికి వస్తావు అని ఎద్దేవా చేశారు. ఆడవాళ్లు బంగారంతో వడ్డాణం చేయించుకున్నట్టుగా పవన్ వారాహి వాహనం చేయించుకుని ఇంట్లో దాచుకున్నాడని అంబటి అన్నారు. ఈ దేశంలో రాజకీయాలకు అనర్హుడు ఎవరైనా ఉన్నారా అంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమేనని అన్నారు.

Next Story