పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు కలిసి కాపులను మోసం చేస్తున్నారు

Ambati Rambabu Fire on Pawan Kalyan And Chandrababu. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Medi Samrat
Published on : 28 Dec 2022 5:45 PM IST

పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు కలిసి కాపులను మోసం చేస్తున్నారు

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు పవన్‌ కళ్యాణ్ ఊడిగం చేస్తున్నారంటూ మంత్రి అంబటి ఫైర్‌ అయ్యారు. పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు కలిసి కాపులను మోసం చేస్తున్నారు.. పవన్‌ బుద్ధి, జ్ఞానం లేని రాజకీయాలు చేస్తున్నాడు. ఒక్కచోట కూడా గెలవలేని పవన్‌ నాపై ఆరోపణలు చేస్తాడా?. చంద్రబాబుకు పవన్‌ ఊడిగం చేస్తున్నాడని విమర్శించారు.

ముఖ్యమంత్రి జగన్ ను నమ్ముకున్న తన వెంట ఉంటారో లేక చంద్రబాబుకి ఊడిగం చేస్తున్న పవన్ వెంట ఉంటారో కాపులు తేల్చుకోవాలని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైసీపీని మళ్లీ అధికారంలోకి రానివ్వనని పవన్ అంటున్నారని, అంత మగాడా ఆయన అని ప్రశ్నించారు. ఒక్క చోట కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ తన గురించి మాట్లాడతారా? అని మండిపడ్డారు. విపక్షాలను తాను విమర్శించినంత ఘాటుగా ఎవరూ విమర్శించరని అందుకే పవన్ తనను టార్గెట్ చేశారని అన్నారు అంబటి. కాపు సామాజికవర్గాన్ని చంద్రబాబు దొడ్లో కట్టేసేందుకు పవన్ ప్రయత్నిస్తూ ఉన్నారని చెప్పుకొచ్చారు అంబటి రాంబాబు.


Next Story