ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో
సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జులై నుండి విశాఖ నుంచే పరిపాలన కొనసాగిస్తానని సీఎం జగన్ మంత్రులతో అన్నారు. మంత్రుల పనితీరును తాను గమనిస్తున్నానని, ఏ మాత్రం తేడా వచ్చిన ఉద్వాసన తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని జగన్ సూచించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు అన్నీ వైసీపీనే గెలవాలని స్పష్టం చేశారు.
సీఎం జగన్ విశాఖ నుంచే పరిపాలన ఉంటుందని, ఏపీ రాజధాని విశాఖేనని ఢిల్లీలోనూ, ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులోనూ ప్రకటించారు. జులైలో విశాఖకు తరలివెళుతున్నామని.. విశాఖ నుంచే పాలన ఉంటుందని అన్నారు.