మసీదులు తెరవడానికి ముందు.. అసదుద్దీన్ ప‌లు సూచనలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Jun 2020 5:43 PM IST
మసీదులు తెరవడానికి ముందు.. అసదుద్దీన్ ప‌లు సూచనలు

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ముగిసింది.. అన్ లాక్ మొదలవుతోంది. జూన్ 8వ తేదీ నుండి పార్థనా మందిరాలను తెరచుకోవచ్చని ప్రభుత్వం సూచలను చేస్తోంది. దేవాలయాలు, మసీదులు, చర్చిలు మొదలైన ప్రార్థనా మందిరాలలో సామాజికదూరాన్ని పాటిస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.

ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ముస్లింలకు తాజాగా కొన్ని సూచనలను చేశారు. జూన్ 8 నుండి మసీదుల్లోకి వెళ్లవచ్చని ప్రభుత్వం చెబుతోందని.. వెళ్లే ముందు, వెళ్లిన తర్వాత కొన్ని సూచనలను పాటించాలని ఆయన అన్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం పెద్దలతో మీటింగ్ ను నిర్వహించాలని కోరారు.

ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన అసదుద్దీన్ ఒవైసీ.. 65 సంవత్సరాల పైబడిన వారిని మసీదులకు రావద్దని కోరారు. ఇంటి వద్దనే నమాజ్ చేసుకోవాలని తెలిపారు. కార్పెట్ల మీద నమాజ్ చేయడం కంటే.. రాతి మీద నమాజ్ చేయాలని అన్నారు. మసీదుల్లో టాయిలెట్లను మూసి ఉంచాలని సూచించారు. ఇంట్లోనే వజూ చేసేసి రావాలని కోరారు. సామాజిక దూరం తప్పకుండా పాటించాలని కోరారు. వివిధ దేశాలలో కూడా నమాజ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారని.. మనం కూడా పాటిద్దామని అన్నారు. జూన్ 8 తర్వాత మసీదుకు వెళ్లి నమాజు చదివే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఎవరూ కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడాలని కోరారు.

అన్ని మతాల పెద్దలను పిలిపించి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రిని, డీజీపీని కోరుతూ ట్వీట్లు చేశారు ఒవైసీ.

Next Story