ముంచుకొస్తున్న 'నిసర్గ్' తుఫాన్.. ఈ పనులు చేయకండి..!

By సుభాష్  Published on  3 Jun 2020 10:37 AM GMT
ముంచుకొస్తున్న నిసర్గ్ తుఫాన్.. ఈ పనులు చేయకండి..!

కరోనా బారిన పడి మహారాష్ట్ర విలవిలలాడుతోంది. కరోనా కేసుల అంకెల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఒక్క ముంబై నగరంలోనే 40 వేలకు పైన కరోనా కేసులు ఉన్నాయంటే మహారాష్ట్ర కరోనా కు ఎంతగా ప్రభావితం అయిందో అర్థం అవుతుంది.

ఈ కరోనా తో యుద్ధం చేస్తున్న మహారాష్ట్ర ప్రజలకి మరో సంకట పరిస్థితి ఇంకొన్ని గంటల్లో ఎదురుకాబోతోంది. అదే "నిసర్గ్" తుఫాన్.

ఈ నిసర్గ్ తుఫాన్ ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితం అయ్యే సూచనలు మెండుగా ఉన్నాయి. ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉంది.

నిసర్గ్ తుఫాను తీరం దాటే సమయంలో రానున్న 12 గంటల్లో గాలులు 110 కి.మీ వేగంతో వీస్తాయి అని "ఐ.ఎం.డి" తెలిపింది. ఈ తుఫాన్ ను అతి తీవ్ర తుఫాన్ గా పరిగణించవచ్చు. తాజగా అందిన సమాచారం ప్రకారం ముంబైకి సమీపంలో ఉన్న అలీబాగ్ వద్ద తీరం దాటింది. తీరం దాటుతున్న సమయంలో గాలి వేగం గంటకు 120 కిలోమీటర్ల వేగంగా ఉంది. తుపాను పూర్తిగా తీరం దాటడానికి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిసర్గ ప్రభావంతో తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. మహారాష్ట్రలోని అన్ని బీచ్ లలో సెక్షన్ 144 ప్రకటించారు. తీరం దాటిన మూడు గంటల్లోగా తుపాను ముంబై, థానే జిల్లాలోకి ప్రవేశించనుంది.

ఈ తుఫాన్ ను ఎదుర్కోవడానికి ముంబై మున్సిపల్ కమిషన్ ప్రజలకి కొన్ని రకాల సలహాలు, సూచనలు చేసింది.

చేయాల్సినవి:

1. 1916 కి ఫోన్ చేసి 4 నెంబర్ నొక్కి తుఫాన్ కి సంబంధించిన ప్రశ్నలు అడగచ్చు.

2. ఇంట్లోనే ఉండండి,మీ మొబైల్ ఫోన్స్ పవర్ బ్యాంక్స్ పూర్తిగా ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి.

3.టార్చ్ లైట్ లు, అత్యవసర దీపాలు వెలిగించండి.

4. గ్యాస్ ఆఫ్ చేయండి అలాగే మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి.

5.ముఖ్యమైన పత్రాలు, కరెన్సీ, విలువైన వస్తువులు ప్లాస్టిక్ డబ్బాలో ఉంచండి.

6.కిటికీ లకు దూరం గా ఉండండి. కిటికీ తలుపులు మూసేయండి.

7.ఇంటి మధ్య భాగంలో ఉండండి. మూలన ఉండవద్దు

8.బలమైన ఫర్నిచర్ కింద తల దాచుకోండి

9.కరెంట్ వైర్లు తెగిపడితే ఎలక్ట్రీషియన్ కు ఫోన్ చేయండి.

చేయకుడనివి:

1. పుకార్లు నమ్మద్దు, ధైర్యం గా ఉండండి.

2.బయటకు వెళ్ళవద్దు.. ఎటువంటి వాహనం నడపద్దు

3. కూలిన భవనాలకు దూరం గా ఉండండి

4.గాయపడిన వారిని ఎలా పడితే అలా తీసుకువెళ్లకూడదు

5. మంట కు కారణమయ్యే వస్తువులను దూరం గా ఉంచండి

Next Story