అక్కడ స్మార్ట్‌గా హైటెక్‌ వ్యభిచారం.. కాలేజీ అమ్మాయిలే టార్గెట్‌

By అంజి  Published on  19 March 2020 10:21 AM GMT
అక్కడ స్మార్ట్‌గా హైటెక్‌ వ్యభిచారం.. కాలేజీ అమ్మాయిలే టార్గెట్‌

'స్మార్ట్‌గా కాలేజీ యువతులు, ఒంటరి మహిళలతో వ్యభిచారం!' అంటూ సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది. ఆ కథనం మేరకు.. పలమనేరు నియోజకవర్గంలో గుట్టు చప్పుడు కాకుండా హైటెక్‌ వ్యభిచారం సాగుతోందని తెలిసింది. వ్యభిచార నిర్వాహకులు స్మార్ట్‌ఫోన్ల ద్వారానే ఈ తతంగాన్ని నిర్వహిస్తున్నారని, కొంత మంది సమాజంలో మంచి వారిలా ఉంటూ.. రహస్యంగా ఈ వ్యవహారం నడిపిస్తున్నారని సమాచారం. కాలేజీ విద్యార్థులే టార్గెట్‌గా ఈ ముఠా పని చేస్తోందని, మొదటగా సోషల్‌ మీడియా ద్వారా అమ్మాయిలను మచ్చిక చేసుకొని, ఆ తర్వాత డబ్బులు ఈజీగా సంపాదించేందుకు వారిని ఈ వలలోకి దించుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత కాలంలో అందరూ స్మార్ట్‌ ఫోన్‌ వాడుతున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా ఫేస్‌బుక్‌, టిక్‌టాక్‌, వాట్సాప్‌, హలో వంటి సోషల్‌ మీడియా యాప్‌లను వాడుతున్నారు. ఇదే అదనుగా వ్యభిచార నిర్వహకులు కొందరు.. మహిళలు, అమ్మాయిలతో చాటింగ్‌లు చేసి, వారితో ఫ్రెండ్‌షిప్‌ చేయడం మొదలు పెట్టి, చివరకు లైవ్‌ కాల్‌ వరకు వెళ్తున్నారు. ఆ తర్వాత వారి ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని వారిని ఈ ఊబిలోకి దించుతున్నారు. ఇంకొందరు యువతలకు జాబ్స్‌ ఉన్నాయని నమ్మించి వల వేస్తున్నారు. మీకు అండగా ఉంటామంటూ అవగాహన కల్పిస్తూ.. వారిని వ్యభిచారంలోకి దించుతున్నారు. ఇక ఒక్కసారి అందులోకి దిగినవారు.. మళ్లీ బయటకు రావడం కష్టమైన విషయమే.

Also Read: కరీంనగర్‌లో 144 సెక్షన్‌

అక్కడి నుంచి డేటింగ్‌ యాప్‌లలోకి..

ఆ తర్వాత యువతులను డేటింగ్‌ యాప్‌లోకి అడ్మిట్‌ చేయిస్తున్నారంటూ సాక్షి తన కథనంలో రాసుకుంది. డేటింగ్‌ యాప్స్‌లో ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌, టిండర్‌, క్రస్‌, స్నాప్‌చాట్‌, జిల్‌, క్వాక్‌ క్వాక్‌, వీ మేట్‌ వంటి యాప్‌ల్లోకి మారుస్తున్నారు. ఈ యాప్స్‌ చాలా మంది యువతను చెడు దారులు పట్టిస్తోంది. ఈ యాప్స్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు లైవ్‌ మీటింగ్‌లతో పాటు, వారిని నియర్‌ బై అనే ఆప్షన్‌ ద్వారా డైరెక్ట్‌గా కలుస్తున్నారు. అయితే ఈ వ్యభిచార ఊబిలో ఒంటరి మహిళలు, కాలేజీ అమ్మాయిలే ఉన్నారని తెలిసింది. కొంత మంది మహిళలు తమ ఆర్థిక అవసరాల కోసం తప్పని తెలిసి చేస్తుంటే, ఇక మరికొందరు విలాసాలకు అలవాడు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

Also Read: మూడేళ్ల కిందట మిస్సయిన తుపాకుల కేసులో సంచలన నిర్ణయం

పలమనేరులోని గంటావూరు, వీకోట, కర్నాటకలోని కేజీఎఫ్‌, బెంగళూరులు ప్రధానంగా ఈ వ్యభిచార కుపాలకు మూలాలుగా ఉన్నాయని తెలిసింది. పలువురు వ్యభిచార నిర్వహకులు స్మార్ట్‌ఫోన్ల ద్వారా విటులను బుక్‌ చేస్తున్నారు. ఇక విటులు సైతం నిర్వహకులకు ఆన్‌లైన్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారని తెలిసింది. పలమనేరు నియోజకవర్గంలోని కొన్ని లాడ్జిలు, పట్టణాల్లోని ఖరీదైన ఇళ్లులు ఈ వ్యభిచారానికి అడ్డాలుగా ఉన్నట్టు తెలుస్తోందని సాక్షి తన కథనంలో రాసింది. ఇటీవల వీకోట పట్టణంలోని ఓ లాడ్జీలో వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో ఓ టీడీపీ నాయకుడి బంధువు కూడా ఉన్నాడని సమాచారం.

Next Story