కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. తాజాగా తెలంగాణలో కరోన వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 8 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఏడుగురు ఇండోనేషియాకు చెందిన వారు కాగా, ఇంకో వ్యక్తి ఇటీవల స్కాట్లాండ్‌ నుంచి వచ్చిన మేడ్చల్‌ వాసి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 13కు చేరకుంది.

కరోనా నేపథ్యంలో కరీంనగర్‌లో 144 సెక్షన్‌ విధించారు. మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని మంత్రి గంగుల కమలాకర్‌ సూచించారు. దుకాణాలు, హోటళ్లను మూసివేశారు. కాగా, ఇండోనేషియా వాసుల్లో ఏడుగురికి కరోనా పాజిటివ్‌ రాగా, కరీంనగర్‌లో వారు కలిసిన వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు ఎవరు కూడా రావద్దని సూచించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.