తెలంగాణలో ఆగని కరోనా బీభత్సం.. కొత్తగా 983 కేసులు
By న్యూస్మీటర్ తెలుగు Published on 28 Jun 2020 9:24 PM ISTతెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 3227 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 983 కేసులు పాజిట్ కేసులు నమోదుఅయ్యాయి. ఇక కరోనాతో 24 గంటల్లో నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 14419 కేసులు నమోదు కాగా, 247 మంది మృతి చెందారు.
ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీలో 816 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 47 కేసులు, మేడ్చల్ జిల్లాలో 29 కేసులు, వరంగల్ అర్బన్ జిల్లాలో 12 కేసులు, మంచిర్యాల జిల్లాలో 33 కేసులు, వరంగల్ రూరల్ జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా తెలంగాణలో అత్యధికంగా కేసులు నమోదవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర కలవరం చెందుతున్నారు.
ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 5172 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్ కాగా, ప్రస్తుతం 9000 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 244 మంది డిశ్చార్జ్ అయ్యారు.