భారత్‌లో 24గంటల్లో 19,906 పాజిటివ్‌ కేసులు కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jun 2020 5:33 AM GMT
భారత్‌లో 24గంటల్లో 19,906 పాజిటివ్‌ కేసులు కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 19,906 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 410 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర, వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా వ్యాప్తి దేశంలో మొదలైన తరువాత ఒక్క రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే.వీటితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 5,28,859 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం నమోదు నమోదు అయిన కేసుల్లో 3,09,713 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 2,03,051 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి భారీన పడి 16,095 మంది ప్రాణాలు కోల్పోయారు.

కాగా.. జూన్‌ 26 వరకు దేశంలో మొత్తం 82,27,802 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,31,095 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ 1,59,133 కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత ఢిల్లీలో 80,188, తమిళనాడులో 78,995 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 13,436 కేసులు నమోదు కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో 12,285 కేసులు నమోదు అయ్యాయి.

Next Story
Share it