ఏపీలో కొత్తగా 9,747 కరోనా కేసులు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Aug 2020 7:56 PM ISTఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా నిత్యం 7వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 64,147 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 9,747 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,66,586కి చేరింది.
కొవిడ్ వల్ల గుంటూరులో 12 మంది, కృష్ణాలో 9 మంది, కర్నూలులో ఎనిమిది మంది, చిత్తూరులో ఏడుగురు, తూర్పుగోదావరిలో ఏడుగురు, నెల్లూరులో ఏడుగురు, అనంతపూర్‌లో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, విశాఖపట్నంలో ఇద్దరు, ప్రకాశంలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు, పశ్చిమగోదావరిలో ఒకరు చొప్పున మొత్తం 67 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 1604కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 95,625 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 79,104 మంది చికిత్స పొందుతున్నారు.
#COVIDUpdates: 04/08/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) August 4, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1,73,438 పాజిటివ్ కేసు లకు గాను
*92,730 మంది డిశ్చార్జ్ కాగా
*1,604 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 79,104#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/TgD8Zjw1B0
కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..
అనంతపురంలో 1325,
చిత్తూరులో 526,
ఈస్ట్ గోదావరిలో 1371,
గుంటూరులో 940,
కడపలో 765,
కృష్ణలో 420,
కర్నూలులో 1016,
నెల్లూరులో 557,
ప్రకాశంలో 224,
శ్రీకాకుంలో 537,
విశాఖపట్నంలో 863,
విజయనగరంలో 591,
పశ్చిమ గోదావరిలో 612 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.