న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 29 Jun 2020 4:26 PM ISTకరోనా వైరస్ నుంచి రక్షణ పొందండిలా..కరోనా లక్షణాలు ఎలా తెలుస్తాయి..?
ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్ర స్థాయిలో ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇక కరోనా నుంచి రక్షించుకునేందుకు ఇప్పటికే అనేక చోట్ల నుంచి సలహాలు వస్తూనే ఉన్నాయి. అయితే మనం కరోనా నుంచి రక్షించుకోవాడనికి వైద్య నిపుణులు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
కరోనా కొత్త లక్షణాలు.. ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణ మృదంగం కొనసాగుతోంది. మన దేశంలోనూ రోజుకు 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి రమారమి 500 మంది కరోనా వలన మరణిస్తున్నారు. రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే కరోనా పేషంట్లలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయని ఇదివరకు నిర్ధారించడం జరిగింది... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీకి కరోనా పాజిటివ్
తెలంగాణలో కరోనా పాజిటివ్ పట్టిపీడిస్తోంది. పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. ఇప్పటికే తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా, ఇప్పుడు తాజాగా డిప్యూటీ సీఎం, హోంమంత్రి మహమూద్‌ఆలీకి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల మహమ్మద్‌అలీకి చెందిన కొందరు సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకింది. అయితే మంత్రికి మూడు రోజుల కింద పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ తేలింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
కేసీఆర్ మళ్లీ లాక్ డౌన్ ప్రకటిస్తే.. ఆ మైలేజీ ఫైర్ బ్రాండ్ దేనట
రాజకీయాలన్నాక భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఒక పార్టీ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు.. విపక్ష నేతలు ఆయన్ను కలవటం.. ప్రజాసమస్యల్ని ఆయనకు వినతిపత్రం రూపంలో అందజేయటం ఎప్పటి నుంచో ఉన్నదే. అంతేకాదు.. ఏదైనా తీవ్రసమస్య ఎదురైనప్పుడు విపక్ష నేతల్ని.. వివిధ రాజకీయ పార్టీలతో కలిసి అఖిలపక్షం వేయటం.. వారి సలహాలు.. సూచనలు తీసుకోవటం మామూలే... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
కరాచీ స్టాక్ మార్కెట్‌పై ఉగ్ర దాడి
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సోమవారం కరాచీలోని స్టాక్ ఎక్ఛేంజ్ భవనంలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. ఇందులో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. దాడికి పాల్పడిన అనంతరం ఉగ్రవాదులు స్టాక్ ఎక్ఛేంజ్ భవనంలోనే నక్కి ఉన్నారు. దీంతో భద్రతా బలగాలు భవంలో ఉన్నవారిని ... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
యాంకర్‌కు ఓపెన్ ఆఫర్ ఇచ్చేసిన వర్మ.. ఓకే అంటే సినిమా..
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవటమే కాదు.. ఊహించని రీతిలో వ్యాఖ్యలు చేసే అలవాటు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఎక్కువే. ఎవరిని ఉద్దేశించి ఎప్పుడేమంటారో ఆయనకు మాత్రమే తెలుస్తుంది. రోటీన్ కు భిన్నంగా వ్యవహరించే ఆయన.. లాక్ డౌన్ లో అందరూ సోషల్ మీడియాలో తమ ఫాలోయర్లతో ఎంగేజ్ అయిన వేళ.. ఆయన మాత్రం ఎడాపెడా సినిమాలు తీసేయటం..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
మహేష్ సినిమాలో రేణు.. అసలు నిజం ఏంటంటే?
ఒకప్పటి హీరోయిన్లు.. తర్వాతి కాలంలో అక్క, వదిన, తల్లి పాత్రలకు మారిపోవడం సహజం. తమకు జోడీగా నటించిన, తమతో పాటే కెరీర్లో ఎదిగిన హీరోల సినిమాల్లోనే తర్వాత సైడ్ క్యారెక్టర్లకు మారిపోతుంటారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్ కూడా ఇప్పుడు ఓ క్యారెక్టర్ రోల్‌కు రెడీ అయినట్లుగా రెండు రోజులుగా గట్టిగా ప్రచారం సాగుతోంది. మహేష్ బాబు కొత్త సినిమాలో ఆమె ప్రత్యేక పాత్ర చేస్తున్నట్లు వార్తలొచ్చాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Fact Check : మాకు ఫేస్ మాస్క్ అవసరం లేదంటూ చూపించే కార్డులు వచ్చాయా..?
కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడం కోసం ఫేస్ మాస్క్ తప్పనిసరి చేశాయి పలు దేశాలు. దీంతో ప్రజలందరూ ఫేస్ మాస్క్ ను తప్పనిసరిగా వాడడం మొదలుపెట్టారు. బయటకు వచ్చే సమయంలో ప్రతి ఒక్కరూ మాస్క్ లు పెట్టుకుంటున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఏపీలో కొత్తగా 706 పాజిటివ్ కేసులు.. 11 మంది మృతి
ఏపీలో కరోనా వైరస్ కాలరాస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. సోమవారం ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 30,216 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 706 మందికి కరోనా పాజిటివ్ తేలింది. రాష్ట్రంలో మొత్తం 793 కేసులు ... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
వైసీపీ నేత దారుణ హత్య
ఏపీలో హత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేత మోకా భాస్కర్‌రావు దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం చేపల మార్కెట్‌లోకి వెళ్లిన భాస్కర్‌రావును గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. అయితే కత్తితో దాడి చేసిన వ్యక్తులు.. కత్తికి సైనెడ్ పూయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హత్యలో ఇద్దరు యువకులు పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా సమాచారం.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి