తెలంగాణలో కొత్తగా 2092 కేసులు.. 13 మరణాలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Aug 2020 3:56 AM GMTరాష్ట్రంలో కొత్తగా 2,092(బుధవారం, 5వ తేధీన) కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 73,050కి చేరాయి. వైరస్ ప్రభావంతో 13 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 589కి చేరింది. ప్రస్తుతం 20,358 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా, 52,103 మంది వైరస్ నుంచి కోలుకు డిశ్చారి అయ్యారు. అలాగే 13,793 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. రాష్ట్రంలో కొత్తగా 21,346 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 5,43,489 పరీక్షలు చేయగా, నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని ఆరోగ్యశాఖ పేర్కొంది.
ఏ జిల్లాలో ఎన్ని కేసులు అంటే..
ఆదిలాబాద్ – 17
భద్రాద్రి కొత్తగూడెం- 36
జీహెచ్‌ఎంసీ -535
జగిత్యాల-28
జనగాం- 26
జయశంకర్ భూపాలపల్లి – 21
జోగులాంబ గద్వాల – 72
కామారెడ్డి -28
కరీంనగర్ -123
ఖమ్మం -64
ఆసిఫాబాద్ – 0
మహబూబ్ నగర్ -48
మహబూబాబాద్ -16
మంచిర్యాల- 43
మెదక్ – 18
మేడ్చల్ మల్కాజ్‌గిరి – 126
ములుగు –27
నాగర్‌కర్నూల్ – 22
నల్లగొండ – 52
నారాయణపేట -06
నిర్మల్ -25
నిజామాబాద్ – 91
పెద్దపల్లి – 54
రాజన్న సిరిసిల్ల -83
రంగారెడ్డి -169
సంగారెడ్డి -101
సిద్దిపేట – 20
సూర్యాపేట-34
వికారాబాద్-09
వనపర్తి – 34
వరంగల్ రూరల్ – 24
వరంగల్ అర్భన్ -128
యాదాద్రి భువనగిరి -12 కేసులు నమోదు అయ్యాయి.