తెలంగాణ‌లో కొత్త‌గా 2083 కేసులు.. 11 మ‌ర‌ణాలు

By Medi Samrat  Published on  1 Aug 2020 4:14 AM GMT
తెలంగాణ‌లో కొత్త‌గా 2083 కేసులు.. 11 మ‌ర‌ణాలు

తెలంగాణలో కరోనా ఉద్దృతి కొనసాగుతోంది. నిన్న(శుక్ర‌వారం 31న) 21,011 శాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా మరో 2,083 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 64,786కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి 530 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా 1,114 మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 46,502కి చేరింది. 17,754 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఏ జిల్లాలో ఎన్ని కేసులు అంటే..

ఆదిలాబాద్ – 17

భద్రాద్రి కొత్తగూడెం- 35

జీహెచ్‌ఎంసీ -578

జగిత్యాల-21

జనగాం- 21

జయశంకర్‌ భూపాలపల్లి – 24

జోగులాంబ గద్వాల -35

కామారెడ్డి -18

కరీంనగర్ -108

ఖమ్మం -32

ఆసిఫాబాద్ -8

మహబూబ్‌ నగర్ -31

మహబూబాబాద్ -40

మంచిర్యాల- 37

మెదక్ – 16

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి – 197

ములుగు –19

నాగర్‌కర్నూల్ – 18

నల్లగొండ – 48

నారాయణపేట -9

నిర్మల్ -25

నిజామాబాద్ –73

పెద్దపల్లి -42

రాజన్న సిరిసిల్ల -39

రంగారెడ్డి -228

సంగారెడ్డి -101

సిద్దిపేట – 16

సూర్యాపేట-34

వికారాబాద్‌-21

వనపర్తి – 9

వరంగల్‌ రూరల్ -39

వరంగల్‌ అర్భన్ -134

యాదాద్రి భువనగిరి -10

Next Story