తెలంంగాణ‌లో కొత్త‌గా 1,897 కేసులు.. 9 మ‌ర‌ణాలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Aug 2020 9:13 AM IST
తెలంంగాణ‌లో కొత్త‌గా 1,897 కేసులు.. 9 మ‌ర‌ణాలు

తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్న(ఆగ‌స్టు 11న మంగ‌ళ‌వారం) 22,972 శాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా మరో 1,897 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 9 మంది మృత్యువాత పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 84,544కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి 654 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 1,920మంది క‌రోనా నుంచి కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో.. ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 61,294కి చేరింది. 22,596 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఏ జిల్లాలో ఎన్ని కేసులు అంటే..

ఆదిలాబాద్ – 21

భద్రాద్రి కొత్తగూడెం- 44

జీహెచ్‌ఎంసీ -479

జగిత్యాల-28

జనగాం- 26

జయశంకర్‌ భూపాలపల్లి – 16

జోగులాంబ గద్వాల – 38

కామారెడ్డి -48

కరీంనగర్ -64

ఖమ్మం -63

ఆసిఫాబాద్ – 5

మహబూబ్‌ నగర్ -41

మహబూబాబాద్ -14

మంచిర్యాల- 38

మెదక్ – 26

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి – 172

ములుగు –10

నాగర్‌కర్నూల్ – 16

నల్లగొండ – 54

నారాయణపేట -12

నిర్మల్ -21

నిజామాబాద్ – 23

పెద్దపల్లి – 62

రాజన్న సిరిసిల్ల -43

రంగారెడ్డి -162

సంగారెడ్డి -107

సిద్దిపేట – 62

సూర్యాపేట-36

వికారాబాద్‌-18

వనపర్తి –26

వరంగల్‌ రూరల్ –24

వరంగల్‌ అర్భన్ -87

యాదాద్రి భువనగిరి -11 కేసులు న‌మోదు అయ్యాయి.

Next Story