తెలంగాణలో కొత్తగా 1891 కేసులు.. 10 మరణాలు
By Medi Samrat Published on 2 Aug 2020 9:45 AM ISTతెలంగాణలో కరోనా ఉద్దృతి కొనసాగుతోంది. నిన్న(శనివారం అగస్టు1న) 19202 శాంపిల్స్‌ను పరీక్షించగా.. కొత్తగా మరో 1891 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 66,677కి చేరింది. ఈ మహమ్మారి బారీన పడి 540 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా 1088 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 47,590కి చేరింది. 18,547 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఏ జిల్లాలో ఎన్ని కేసులు అంటే..
ఆదిలాబాద్ – 19
భద్రాద్రి కొత్తగూడెం- 32
జీహెచ్‌ఎంసీ -517
జగిత్యాల-14
జనగాం- 15
జయశంకర్ భూపాలపల్లి – 00
జోగులాంబ గద్వాల -38
కామారెడ్డి -42
కరీంనగర్ -93
ఖమ్మం -47
ఆసిఫాబాద్ -2
మహబూబ్ నగర్ -33
మహబూబాబాద్ -24
మంచిర్యాల- 28
మెదక్ – 21
మేడ్చల్ మల్కాజ్‌గిరి – 146
ములుగు –11
నాగర్‌కర్నూల్ – 01
నల్లగొండ – 46
నారాయణపేట -11
నిర్మల్ -08
నిజామాబాద్ –131
పెద్దపల్లి -37
రాజన్న సిరిసిల్ల -28
రంగారెడ్డి -181
సంగారెడ్డి -111
సిద్దిపేట – 16
సూర్యాపేట-27
వికారాబాద్-35
వనపర్తి – 8
వరంగల్ రూరల్ -22
వరంగల్ అర్భన్ -138
యాదాద్రి భువనగిరి -12