తెలంగాణ‌లో అదుపులోకి రాని క‌రోనా.. కొత్త‌గా 1676 కేసులు

By Medi Samrat  Published on  16 July 2020 5:08 PM GMT
తెలంగాణ‌లో అదుపులోకి రాని క‌రోనా.. కొత్త‌గా 1676 కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 14,027 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. 1,676 కేసులు పాజిట్ కేసులు నమోదుఅయ్యాయి. ఇక క‌రోనాతో 24 గంట‌ల్లో ప‌ది మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 41,018 కేసులు నమోదు కాగా, 396 మంది మృతి చెందారు.

ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలో 788 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్య‌ధికంగా రంగారెడ్డి జిల్లాలో 224 కేసులు, మేడ్చ‌ల్‌ జిల్లాలో 160 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 57 కేసులు, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌‌ జిల్లాలో 47 కేసులు, క‌రీంన‌గ‌ర్‌‌ జిల్లాలో 92 కేసులు, మెద‌క్‌‌ జిల్లాలో 26 కేసులు, ఖ‌మ్మం జిల్లాలో 10 కేసులు‌, మ‌హ‌బూబ‌బాద్ జిల్లా‌లో 19 కేసులు, న‌ల్గొండ‌ జిల్లాలో 64 కేసులు , నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాలో 30 కేసులు, నిజామాబాద్ జిల్లాలో 20 కేసులు, వ‌న‌ప‌ర్తి జిల్లాలో 51 కేసులు, సూర్యాపేట జిల్లాలో 20 కేసులు చొప్పున‌ నమోదయ్యాయి. గ‌త నెల‌ రోజులుగా తెలంగాణ‌లో అత్య‌ధికంగా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు తీవ్ర క‌ల‌వ‌రం చెందుతున్నారు.

ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 27,295 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్‌ కాగా, ప్రస్తుతం 13,328 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 1,296 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.‌



Next Story