తెలంగాణలో కొత్తగా 1597 కరోనా పాజిటివ్ కేసులు
By Medi Samrat Published on 15 July 2020 10:20 PM ISTతెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 13,642 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 1,597 కేసులు పాజిట్ కేసులు నమోదుఅయ్యాయి. ఇక కరోనాతో 24 గంటల్లో పదకొండు మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 39,342 కేసులు నమోదు కాగా, 386 మంది మృతి చెందారు.
ఇక తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీలో 796 కేసులు నమోదు కావడంతో నగర వాసులు మరింత భయాందోళన చెందుతున్నారు. ఆ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 212 కేసులు, మేడ్చల్ జిల్లాలో 115 కేసులు, సంగారెడ్డి జిల్లాలో 73 కేసులు, వరంగల్ అర్బన్ జిల్లాలో 44 కేసులు, కరీంనగర్ జిల్లాలో 41 కేసులు, మెదక్ జిల్లాలో 18 కేసులు, మంచిర్యాల జిల్లాలో 26 కేసులు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 15 కేసులు, నల్గొండ జిల్లాలో 58 కేసులు , కామారెడ్డి జిల్లాలో 30 కేసులు, నిజామాబాద్ జిల్లాలో 13 కేసులు, సూర్యాపేట జిల్లాలో 14 కేసులు, సిద్దిపేట జిల్లాలో 27 కేసులు, మహబూబ్ నగర్ జిల్లాలో 21 కేసులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 13 కేసులు, పెద్దపల్లి జిల్లాలో 20 కేసులు చొప్పున నమోదయ్యాయి. గత నెల రోజులుగా తెలంగాణలో అత్యధికంగా కేసులు నమోదవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర కలవరం చెందుతున్నారు.
ఇదిలావుంటే.. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 25999 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్ కాగా, ప్రస్తుతం 12,958 మంది చికిత్స పొందుతున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో 1,159 మంది డిశ్చార్జ్ అయ్యారు.
�