ఏపీలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. గడిచిన 24 గంటల్లో 22,197 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 2432 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 2412 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 20 మంది ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 35451కి చేరింది.

కొవిడ్‌ వల్ల అనంత‌పురంలో తొమ్మిది మంది, పశ్చిమగోదావరిలో తొమ్మిది మంది, కర్నూలులో ఐదుగురు, చిత్తూరులో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, కడపలో ఇద్దరు, కృష్ణలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, నెల్లూరులో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున మొత్తం 44 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 452 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 18378 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 16621 మంది చికిత్స పొందుతున్నారు.

కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా..

అనంతపురంలో 162,

చిత్తూరులో 257,

ఈస్ట్‌ గోదావరిలో 247,

గుంటూరులో 468,

కడపలో 112,

కృష్ణలో 108,

కర్నూలులో 403,

నెల్లూరులో 45,

ప్రకాశంలో 53,

శ్రీకాకుంలో 178,

విశాఖపట్నంలో 123,

విజయనగరంలో 49,

పశ్చిమ గోదావరిలో 207 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.



తోట‌ వంశీ కుమార్‌

Next Story