సీఎం జగన్ ఇంట తీవ్ర విషాదం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Oct 2020 3:35 AM GMT
సీఎం జగన్ ఇంట తీవ్ర విషాదం

ఏపీ సీఎం వైఎస్‌ జగన్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జ‌గ‌న్‌ మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు.

కాగా.. గంగిరెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి తండ్రి. ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులు. ఈయనకు పేదల డాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు.

0101

ఇదిలావుంటే.. సీఎం‌ జగన్ నేడు పులివెందులకు రానున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుండి పులివెందుల‌కు బ‌య‌లుదేరుతారు. అక్క‌డ గంగిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొంటారు. ఇటీవలే సీఎం జగన్ ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్లి ఆస్పత్రిలో ఉన్న తన మామను పరామర్శించి వచ్చారు.

Next Story
Share it