ఆయన వెంకన్న స్వామిని.. 'వెంకన్న చౌదరి' చేశారు.!
By Medi Samrat Published on 16 Nov 2019 2:31 PM ISTముఖ్యాంశాలు
- చంద్రబాబు జిరాక్స్ పవన్ కళ్యాణ్.!
- జనం 151 సీట్లిస్తే ఓర్వలేకపోతున్నారు
- విజయవాడలో 40 దేవాలయాలు కూలగొట్టారు
151 సీట్లతో జనం జగన్ కి అధికారం ఇస్తే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అబద్దాలు, అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలనున పక్కదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు పెంచాలన్న ఇంగిత జ్ఞానం లేదని పైర్ అయ్యారు. అన్యమత ప్రచారం అంటూ ప్రభుత్వం పై బురదజల్లాలని చూస్తున్నారని విమర్శించారు.
వేంకటేశ్వర స్వామి మా కుల దైవం అని చంద్రబాబు అంటారని.. మాజీ ఎంపీ మురళీమోహన్ వెంకన్న స్వామిని.. వెంకన్న చౌదరిని చేశారని ఎద్దేవా చేశారు. దుర్గగుడి, శ్రీ కాళహస్తిలో క్షుద్రపూజలు జరిగింది మీ హయాంలోనేనని.. మీరు చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కాదని అన్నారు. విజయవాడలో 40 దేవాలయాలను దగ్గరుండి కూలగొట్టించారని.. మా హయాంలో దేవాలయాలకు పెద్ద పీట వేస్తున్నామని అన్నారు.
చంద్రబాబుకి తోడు పవన్ కళ్యాణ్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని.. జగన్ ని నేరుగా ఎదుర్కోలేకనే దొడ్డి దారిన విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు జిరాక్స్ పవన్ కళ్యాణ్ అని.. జగన్ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకి, మాజీ మంత్రులకు లేదని విష్ణు అన్నారు.