నెల్లూరులో అద్భుతం : ఇసుక త్రవ్వకాల్లో బయటపడ్డ శివాలయం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Jun 2020 11:46 AM GMT
నెల్లూరులో అద్భుతం : ఇసుక త్రవ్వకాల్లో బయటపడ్డ శివాలయం

నెల్లూరు: ఇసుక త్రవ్వకాల్లో భాగంగా చేస్తున్న పనుల్లో శివాలయం బయటపడడం విశేషం. మట్టిలో కూరుకుపోయిన శివాలయాన్ని నెల్లూరు జిల్లా చీరాల మండలం లోని పెరుమళ్ళ పాడు గ్రామంలో గుర్తించారు. ఇలా శివాలయం బయటపడడం చూసి పలువురు ఆశ్చర్యపోయారు. నమ్మలేకపోతున్నామంటూ పలువురు ఆలయానికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు.



పరశురాముడు ఈ ఆలయాన్ని కట్టించాడని స్థానికులు నమ్ముతున్నారు. పెన్నా నది ప్రవాహం దిశ మార్చుకోవడం వలన ఈ ఆలయం నీటమునిగిపోయిందని స్థానికులు భావిస్తున్నారు. ఇసుక కోసం త్రవ్వకాలు మొదలుపెట్టినప్పుడు ఈ ఆలయ ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు సమాచారం అందించారు. బుధవారం నాడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ రామ సుబ్బారెడ్డి ఆ ప్రాంతాన్ని సందర్శించారు.

A1

1850లో వచ్చిన వరదల కారణంగా ఈ ఆలయం ఇసుకలో కూరుకుపోయి ఉండొచ్చని ఆర్కియాలజీ టీమ్ భావిస్తోంది. ఈ ఆలయంపై పూర్తి స్థాయిలో పరిశోధనలు జరపాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆలయాన్ని బాగు చేయాలని.. తాము పూజలు చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని స్థానికులు కోరినట్లు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. త్వరలోనే ఆలయాన్ని బాగుచేసేలా చర్యలు తీసుకుంటామంటూ అధికారులు స్థానికులకు హామీ ఇచ్చారు.

Next Story