మచిలీపట్నంలో మత్స్యకారుల వలకు చిక్కిన భారీ టేకు చేప

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Jun 2020 10:59 AM GMT
మచిలీపట్నంలో మత్స్యకారుల వలకు చిక్కిన భారీ టేకు చేప

కృష్ణ జిల్లా మచిలీపట్నంలోని గిలకలదిండి ప్రాంత సమీపంలో మంగళవారం సాయంత్రం భారీ టేకు చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఈ టేకు చేప బరువు సుమారు రెండు టన్నులు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు.

Untitled 3 Copy

దీని ధర మార్కెట్‌లో సుమారు రూ.50వేలు ఉంటుందని తెలిపారు. దీనిని అతి కష్టం మీద ఒడ్డుకు తెచ్చారు. క్రేన్‌ సహాయంతో టేకు చేపను బయటకు తీశారు. ఇలాంటి చేపలు అరుదుగా దొరుకుతుంటాయన్నారు.ఈ చేపలోని రసాయనాలను ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారన్నారు. ఇక ఈ అరుదైన చేపను చూసి ప్రజలు ఆశ్చర్యపొతున్నారు.

Untitled 4 CopyNext Story