మచిలీపట్నంలో మత్స్యకారుల వలకు చిక్కిన భారీ టేకు చేప
By తోట వంశీ కుమార్ Published on : 17 Jun 2020 4:29 PM IST

కృష్ణ జిల్లా మచిలీపట్నంలోని గిలకలదిండి ప్రాంత సమీపంలో మంగళవారం సాయంత్రం భారీ టేకు చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఈ టేకు చేప బరువు సుమారు రెండు టన్నులు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు.

దీని ధర మార్కెట్‌లో సుమారు రూ.50వేలు ఉంటుందని తెలిపారు. దీనిని అతి కష్టం మీద ఒడ్డుకు తెచ్చారు. క్రేన్ సహాయంతో టేకు చేపను బయటకు తీశారు. ఇలాంటి చేపలు అరుదుగా దొరుకుతుంటాయన్నారు.ఈ చేపలోని రసాయనాలను ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారన్నారు. ఇక ఈ అరుదైన చేపను చూసి ప్రజలు ఆశ్చర్యపొతున్నారు.

�
Next Story