Fact Check : చేతిలో సెలైన్ బాటిల్ పెట్టుకున్న మహిళ ఇప్పటి పరిస్థితిని తెలియజేస్తోందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Jun 2020 7:54 AM GMT
Fact Check : చేతిలో సెలైన్ బాటిల్ పెట్టుకున్న మహిళ ఇప్పటి పరిస్థితిని తెలియజేస్తోందా..?

'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్' అంటూ భారతప్రధాని నరేంద్ర మోదీ ఫైనాన్షియల్ ప్యాకేజీని దేశానికి విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ దృఢంగా ఉండాలని.. గుండె నిబ్బరం చేసుకుని ఉండాలన్నదే ప్రధాని ఆకాంక్ష. కోవిద్-19 కారణంగా లాక్ డౌన్ అమలు చేశారు ప్రధాని. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని అనుకున్నారు.. కానీ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి.

తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్ సామాజిక మాధ్యమాల్లో ఓ ఫోటోను పోస్టు చేసి.. ఇదీ 'ఆత్మనిర్భర్ భారత్' అంటూ చెప్పుకొచ్చారు. ఇంతకూ ఆ ఫోటోలో ఏముందంటే..? ఓ పిల్లవాడిని కింద ఓ మహిళ పట్టుకుని కూర్చుని ఉంటే.. మరో మహిళ పక్కన నిలబడి.. సెలైన్ బాటిల్ ను పట్టుకుని నిలబడింది. దేశంలో పరిస్థితి ఇలా ఉంది అంటూ “हर विपदा से लड़ने की, हम में बड़ी महारत है ये आत्मनिर्भर भारत है ये #आत्मनिर्भर भारत है!” హిందీలో ట్వీట్ చేశారు శశి థరూర్. 'ప్రతి ఒక్క విపత్తును మనం ఎంతో ధైర్యంతో ఎదుర్కొంటాం.. ఇదే ఆత్మనిర్భరభారత్' అని ఆయన తెలిపారు.



ఈ ఫోటోను పలువురు ప్రముఖులు తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశారు.



నిజ నిర్ధారణ:

ఆత్మనిర్భర భారత్ అంటూ శశి థరూర్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి పోస్టు 'పచ్చి అబద్ధం'.

శశి థరూర్ చెబుతున్నట్లుగా ఈ ఫోటో ఇప్పటిది కానే కాదు. శశి థరూర్ పెట్టిన ట్వీట్ కు అసిస్టెంట్ ప్రొడ్యూసర్, ఫోటోగ్రాఫర్ అమితేష్ రిప్లై ఇచ్చాడు. ఈ ఫోటో ఇప్పటిది కానే కాదని 2017లో తాను ఈ ఫోటోను మీర్జాపూర్ లో తీశాను అని స్పష్టం చేశాడు. 2019లో ఈ ఫోటోను తాను ఇంస్టాగ్రామ్ లో పోస్టు చేసాను అంటూ లింక్ ను కూడా పోస్ట్ చేసాడు.



అమితేష్ ఈ పోస్టును తన ఇంస్టాగ్రామ్ లో పోస్టు చేసి.. “चूंकि ये फोटो कई लोगों ने डाल दी है। इसलिए ये बताना जरूरी है। ये तस्वीर 2017 की है। उत्तर प्रदेश विधानभा चुनाव के दौरान की। तस्वीर मिर्ज़ापुर की है। तस्वीर 5:24 शाम की है।“.అని కామెంట్ పెట్టాడు.

ఎంతో మంది ఈ ఫోటోను అప్లోడ్ చేశారు. ఈ ఫోటోను ఉత్తరప్రదేశ్ ఎన్నికలప్పుడు 2017లో మీర్జాపూర్ లో తీశాను అని చెప్పుకొచ్చాడు.

Lallantop యూట్యూబ్ ఛానల్ లో కూడా ఈ వీడియోకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేశారు. యూపీ ఎలక్షన్స్ సమయంలో ఈ ఫోటోలను తీశామని అమితేష్ అందులో వివరణ ఇచ్చాడు. తాను తీసిన ఫోటోను చాలా మంది ఎడిట్ చేసి వాడుకుంటున్నారని అన్నాడు.

Lallantop ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో గతంలో ఈ ఫోటోను పోస్టు చేశారు.

ఒరిజినల్ ఫోటోకు సంబంధించిన మెటా డేటాను కూడా మనం చూడొచ్చు.

M1

ఆత్మనిర్భర్ భారత్ కు ప్రతిబింబం ఈ ఫోటో అంటూ షేర్ చేస్తున్నదంతా 'పచ్చి అబద్ధం'.. ఈ ఫోటో 2017కు చెందినది.

Claim Review:Fact Check : చేతిలో సెలైన్ బాటిల్ పెట్టుకున్న మహిళ ఇప్పటి పరిస్థితిని తెలియజేస్తోందా..?
Claim Fact Check:false
Next Story